హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్బీ టెట్) సెక్రటరీగా పనిచేస్తున్న ఏ.పుల్లయ్య డిప్యుటేషన్ గడువును ప్రభుత్వం మరో రెండేళ్ల పాటు పొడిగించింది.ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆర్జేడీ హోదాలో ఉన్న పుల్లయ్య ప్రస్తుతం ఎస్బీటీఈటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన డిప్యుటేషన్ గడువును పొడిగించాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం అంగీకరించింది.
