మేం రోడ్డెక్కే పరిస్థితి కల్పించారు

మేం రోడ్డెక్కే  పరిస్థితి కల్పించారు

ఖైరతాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తానంటూ మాట ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడా విషయాన్ని మరుగున పెడుతున్నారని ఎంఆర్​పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. సీఎం మాట తప్పడం వల్లే  తాము రోడ్డెక్కే పరిస్థితిని కల్పించారన్నారు. ఈ  నెల 9న కలెక్టరేట్ల ఎదుట నల్లజెండాలతో నిరసన చేపడతామని చెప్పారు.  వర్గీకరణపై  సుప్రీం తీర్పును అమలు చేస్తానన్న సీఎం ఇప్పడు దాటవేయడానికి కారణం మాల ఎమ్మెల్యేలు ఒత్తిడి తీసుకురావడమే అన్నారు.