తెలంగాణ హైకోర్టు చీఫ్ ఉజ్జల్ భూయాన్ కు సుప్రీం జడ్జిగా ప్రమోషన్

తెలంగాణ హైకోర్టు చీఫ్ ఉజ్జల్ భూయాన్ కు సుప్రీం జడ్జిగా ప్రమోషన్

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ వెంకటనారాయణ భట్టిలను సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా నియమించాలని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం 2023 జూలై 5 బుధవారం రోజున  సిఫార్సు చేసింది.

 జస్టిస్‌లు సంజయ్‌ కిషన్‌ కౌల్‌, సంజీవ్‌ ఖన్నా, బిఆర్‌ గవాయ్‌, సూర్యకాంత్‌లతో కూడిన సుప్రీం కోర్టు కొలీజియం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుని ఈ తీర్మానాన్ని తుది అనుమతుల కోసం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు పంపించింది. సాధారణంగా- కొలీజియం చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం యధాతథంగా ఆమోదిస్తుంటుంది. 

సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులు ఉన్నారు, అయితే గత నెలలో ముగ్గురు న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన తర్వాత ప్రస్తుతం 31 మందితో పని చేస్తున్నారు. జస్టిస్ కృష్ణ మురారి 2023 జూలై 7 శుక్రవారం రోజున  పదవీ విరమణ చేయనున్నారు. 2022 జూన్  28 నుంచి  ఉజ్జల్ భూయాన్ తెలంగాణ హైకోర్టు జడ్జిగా ఉన్నారు.  అటు 2023 జూన్ 1 నుంచి ఎస్వీ భట్టి కేరళ హైకోర్టు జడ్జిగా ఉన్నారు.  

కాగా ఇటీవలే ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కూడా పదోన్నతి మీద సుప్రీంకోర్టుకు బదిలీ అయిన విషయం తెలిసిందే.