SBIకు రేపే లాస్ట్.. ఎలక్టోరల్ బాండ్స్ డిటేల్స్ ఇవ్వకుంటే, ధిక్కార చర్య: సుప్రీం కోర్టు

SBIకు రేపే లాస్ట్.. ఎలక్టోరల్ బాండ్స్ డిటేల్స్ ఇవ్వకుంటే, ధిక్కార చర్య: సుప్రీం కోర్టు

ఎలక్టోరల్ బాండ్స్ డిటేల్స్ అందించడానికి గడువు పొడిగించాలని కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు  కొట్టివేసింది. SBI దాఖలు చేసిన దరఖాస్తు ఎన్‌క్యాష్ చేయబడిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కోర్టుకు సమర్పించడానికి జూన్ 30 వరకు సమయాన్ని పొడిగించాలని కోరింది. దీన్ని సుప్రీం కోర్టు దర్మాసనం తిరస్కరించింది. రేపటిలోగా, పని వేళల్లోగా ఎలక్టరోల్ బాండ్ల వివరాలు  తెలియజేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండాయాను సుప్రీం కోర్టు ఆదేశించింది.

రేపు వర్కింగ్ అవర్స్(సాయంత్రానికి) ముగిసేలోపు రేపటిలోగా ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని అందజేయకపోతే ఎస్‌బీఐపై ధిక్కార చర్యలు తీసుకుంటామని ఎస్‌బీఐని సుప్రీంకోర్టు హెచ్చరించింది. మార్చి 15లోగా ఎస్‌బీఐ షేర్ చేసిన డేటా మొత్తం తమ అధికారిక పోర్టల్‌లో అందుబాటులో ఉండాలని కూడా సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది.

ఎస్‌బిఐకి వ్యతిరేకంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) దాఖలు చేసిన ధిక్కార పిటిషన్‌ను న్యాయమూర్తుల బెంచ్ పరిష్కరించింది. మార్చి 6లోగా ఎన్నికల కమిషన్‌కు ఎన్‌క్యాష్ చేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను SBI ఉద్దేశపూర్వకంగా ధిక్కరించిందని ఈ పిటిషన్ లో ఆరోపించింది.