బీమా కోరేగావ్ కేసు..ఉద్యమకారిణి జ్యోతి జగ్తాప్కు మధ్యంతర బెయిల్

బీమా కోరేగావ్ కేసు..ఉద్యమకారిణి జ్యోతి జగ్తాప్కు మధ్యంతర బెయిల్

భీమా కోరేగావ్​ ఎల్గార్​ పరిషత్​ కార్యకర్త, కబీర్​మంచ్​ సభ్యురాలు జ్యోగి జగ్​ తాప్​ కు సుప్రీంకోర్టులో ఉరట లభించింది.. బుధవారం (నవంబర్​19) జ్యోతి జగ్​ తాప్​ కు మధ్యంతర బెయిల్​ మంజూర్​ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 2026 కు వాయిదా వేసిన కోర్టు అప్పటి  వరకు ఆమెకు బెయిల్​మంజూరు చేసింది. జస్టిస్​ ఎంఎం సుందరేష్​, జస్టిస్​ సతీష్​ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

ఐదేళ్లు జ్యోతి జగ్​ తాప్​ కస్టడీలో ఉన్నారు..బెయిల్​ ఇవ్వాలని ఆమె తరపు న్యాయవది అపర్ణభట్​ సుప్రీంకోర్టును కోరారు. వాదోపవాదాలు విన్నత ర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం జ్యోతి జగ్​ తాప్​ కు మధ్యంతర బెయిల్​ ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ కేసులో మరో నిందితుడు  మహేష్​ రౌత్​ కు కూడా ఇంతకుముందు ఆరువారాల బెయిల్​ మంజూరు చేసింది సుప్రీంకోర్టు.  

2018లో ఫూణెలోని భీమా కోరేగావ్​ లో జరిగిన అల్లర్ల కేసులో జ్యోతి జగ్​ తాప్​ తో సహా 16మందిని అరెస్ట్​  చేసింది ఎన్​ఐఏ. అల్లర్లకు వీరిని బాధ్యులుగా  ఆరోపించింది.  కోరేగావ్​ సమీపంతో నిర్వహించిన ఎల్గార్​ పరిషత్​  200 వార్షోకోత్సవ సభలేమరాఠా, దళిత గ్రూపుల మధ్య హింసాత్మక ఘర్షణలకు కారణమని వాదించింది. హింసకు కుట్రపూరితంగా పథకం పన్నారని ఆరోపిస్తూ 16మందిని అరెస్ట్​ చేశారు. ఈమెయిల్స్​ ఆధారంగా UAPA చట్టం కింది అభియోగాలు మోపారు.