అలా చేస్తే జాబ్ ఇవ్వొద్దు.. ప్రభుత్వ ఉద్యో్గాల నియామకంపై.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

అలా చేస్తే జాబ్ ఇవ్వొద్దు.. ప్రభుత్వ ఉద్యో్గాల నియామకంపై.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

ప్రభుత్వ ఉద్యోగాలను నోటిఫికేషన్‌‌‌‌లో పేర్కొన్న అర్హతల ప్రకారమే భర్తీ చేయాలని సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. తక్కువ విద్యార్హత గల పోస్టుల కోసం, ఎక్కువ చదువుకున్న వారు తమ అర్హతలను దాచిపెట్టి ఉద్యోగాలు పొందడం.. అర్హులైన పేద అభ్యర్థుల హక్కులను హరించడమేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. విద్యా అర్హతను దాచిపెట్టి బ్యాంక్ అటెండెంట్‌‌‌‌గా చేరిన ఒక ఉద్యోగిని  విధుల్లోకి తీసుకోవాలంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కొట్టివేసింది.  ఎక్కువ అర్హతలు ఉన్నవారితో పోటీ పడలేని వెనుకబడిన అభ్యర్థుల కోసం కొన్ని కేటగిరీల పోస్టులను ప్రత్యేకంగా కేటాయించే హక్కు ప్రభుత్వానికి ఉందని, ఈ విధానాన్ని కోర్టులు ఎల్లప్పుడూ సమర్థిస్తాయని స్పష్టం చేసింది.