సింగరేణి సంస్థలోని 32 డాక్టర్ పోస్టులు.. 135 మంది పోటీ

సింగరేణి సంస్థలోని 32 డాక్టర్ పోస్టులు.. 135 మంది పోటీ

హైదరాబాద్, వెలుగు: సింగరేణి సంస్థలోని వివిధ ఏరియా ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకానికి శుక్రవారం రెండో రోజు ఇంటర్వ్యూ నిర్వహించారు. డైరెక్టర్ పర్సనల్ గౌతమ్ పొట్రు నేతృత్వంలో ప్రభుత్వ వైద్య నిపుణుల ప్యానెల్​ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. 

7 అనస్థిటిస్ట్ పోస్టులు, ఒక పాథాలజీ, ఒక సైకియాట్రిస్ట్ పోస్టుతో పాటు 3 హెల్త్ ఆఫీసర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం 61 మంది అభ్యర్థులు హాజరయ్యారు. గురు, శుక్రవారం కలిపి మొత్తం 32 స్పెషలిస్ట్ డాక్టర్ల ఎంపిక‌‌ కోసం 135 మంది యువ వైద్య నిపుణులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.