ఇటీవల ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంతో సక్సెస్ అందుకున్న హీరో సూర్య.. ప్రస్తుతం జితూ మాధవన్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘సీన్’. నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తుండగా 'ప్రేమలు' ఫేమ్ నస్లెన్, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. జగరం స్టూడియోస్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సూర్య, జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఒక పాటను విడుదల చేయగా, దసరా సందర్భంగా సోమవారం సెకండ్ సాంగ్ రిలీజ్ చేశారు.
సుశిన్ శ్యామ్ కంపోజ్ చేయగా, రాకేందు మౌళి తెలుగు లిరిక్స్ రాశాడు. ముఖేష్ ,మహ్మాద్ పాడారు. ‘అరెయ్ ఏరోప్లెయిన్ పిల్ల.. ఎగరేసేయ్ నన్ను గాల్లో.. కొరియన్ డ్రామా హీరోలా.. నే పాడేస్తున్నా ఫీలా..’ అంటూ సాగిన పాటలో సూర్య, నజ్రిమ్ మధ్య వచ్చే కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. మలయాళంలో రోమాంచం, ఆవేశం చిత్రాలతో మెప్పించిన జితూ మాధవన్ డైరెక్ట్ చేస్తుండడంతో ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. దీపావళి కానుకగా నవంబర్ 6న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల కానుంది.
