1,2 క్లాసులకు డిజిటల్ తరగతుల షెడ్యూల్‌

1,2 క్లాసులకు డిజిటల్ తరగతుల షెడ్యూల్‌

హైదరాబాద్: ఆగస్టు 3 తేదీ నుండి ఒకటి, రెండవ తరగతుల విద్యార్థులకు డిజిటల్ పాఠాలు ప్రారభం కానున్నాయి. ఆగ‌స్టు నెల‌లో ప్రతిరోజూ T-SAT నిపుణ‌ ఛానల్ ద్వారా 30 నిమిషాల పాటు రెండు పాఠాలతో కూడిన డిజిటల్ తరగతులు ప్రసారం చేయబడుతాయి. ఇప్పటివరకు దూరదర్శన్ యాదగిరి, T-SAT నెట్‌వర్క్ ఛానెల్‌ల ద్వారా 3 నుండి 10 వ తరగతి వరకు బ్రిడ్జి కోర్సులతో కూడిన డిజిటల్ తరగతులు నిర్వహించబడుతున్నాయి. 1 నుండి 10 వ తరగతి వరకు ఆగస్టు 3 నుండి 13 వరకు తరగతి వారీగా డిజిటల్ ట్రాన్స్‌మిషన్ షెడ్యూల్‌ను స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ (SIET) శ‌నివారం విడుదల చేసింది.