యూత్ కాంగ్రెస్ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్.. శివసేన రెడ్డి రాజీనామా

యూత్ కాంగ్రెస్ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్.. శివసేన రెడ్డి రాజీనామా

తెలంగాణ కాంగ్రెస్ లో ఎన్నికల నగార మోగింది. కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అయిన యూత్ కాంగ్రెస్ కమిటీ టర్మ్ ముగీయడంతో ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ షెడ్యూల్ విడుదల చేశారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఆగస్టు 5 నుండి సెప్టెంబర్ 5 వరకు మెంబర్షిప్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శివసేన రెడ్డి మాట్లాడారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

 కష్టపడి పని చేసిన వారికి అవకాశం ఇవ్వాలని జాతీయ నాయకత్వాన్ని కోరుతున్నానని తెలిపారు. బీఆర్ఎస్ ను గద్దె దింపడానికి యూత్ కాంగ్రెస్ కృషి చేసిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు వందల  మంది యువజన కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారని చెప్పారు. వాళ్లంతా ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. ఈ మూడేండ్లలో చాలా మంది తమ కుటుంబాలని వదిలి యువజన కాంగ్రెస్ కోసం కష్ట పడ్డారని అన్నారు. కష్టపడ్డవారిని అందరిని గుర్తు పెట్టుకుంటమన్నారు. తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకు సీనియర్ గా కృషి చేస్తానని తెలిపారు. 

ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి యువజన కాంగ్రెస్ కారణమన్నారు. రాహుల్ గాంధీ కూడా యువజన కాంగ్రెస్ నుండి వచ్చిన వ్యక్తేనని తెలిపారు. దేశానికి లీడర్ షిప్ అందిస్తున్న నేతలందరూ NSUI,యువజన కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్ళేనని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రపంచంలో అతిపెద్ద పెద్ద ప్రజాస్వామిక పార్టీ అని చెప్పారు మహేష్ కుమార్ గౌడ్.