ద్రాక్ష, చక్కెరతో కల్తీ వైన్ తయారు చేస్తూ దొరికిపోయిన మహిళ

ద్రాక్ష, చక్కెరతో కల్తీ వైన్ తయారు చేస్తూ దొరికిపోయిన మహిళ

హైదరాబాద్ : ఇంట్లో కల్తీమద్యం తయారు చేస్తున్న ముఠాను ముషిరాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. లాలాగూడ, విజయపురి కాలనీకి చెందిన గేరాల్డింగ్ మిల్స్(54) గృహిణి ఇంట్లోనే ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా కల్తీలిక్కర్ తయారు చేస్తోంది. ద్రాక్ష పండ్లు, చక్కెరతో వైన్ తయారు చేసి దాన్ని లీటర్, రెండు లీటర్ల బాటిల్స్ లో నింపి విక్రయిస్తుంది.  కొంతమంది ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నట్టు సమాచారంతో ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. 

ALSO READ | వామ్మో దొంగలు.. రిటైర్డ్ ఐఏఎస్ ను వదల్లేదు..

ముషిరాబాద్ ఆబ్కారీ పోలీసులు చేసిన రైడ్ లో 90 కల్తీ వైన్ బాటిల్ సీజ్ స్వాదీనం చేసుకున్నారు. గేరాల్డింగ్ మిల్స్ తోపాటు పలువురిని అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ పోలీసులు 112 బాటిల్స్ లో నింపిన 90 లీటర్ల కల్తీ ద్రాక్ష వైన్ ని స్వాధీనం చేసుకున్నారు. వైన్ ను నింపడానికి సిద్ధంగా ఉన్న ఖాళీ సీసాలను కూడా సీజ్ చేశారు. గతంలోనూ ఆ మహిళ కల్తీ వైన్ తయారు చేస్తూ అరెస్ట్ అయినట్లు పోలీసులు గుర్తించారు.