విచిత్ర సంఘటన..నవ్వు తెప్పించే లెటర్..స్కూల్ ప్రిన్సిపాల్ కు విద్యార్థులు ఇచ్చిన లెటర్..గర్ల్స్ ను సపరేట్ గా కూర్చోబెట్టండి..వారితో మాకు ఇబ్బంది కలుగుతుం ది.. అని ఏకంగా క్లాస్ బాయ్స్ అంతా కలిసి కంప్లెయింట్ చేసిన వింత ఘటన.. ఇక గర్ల్స్ ను సపరేట్ చేయాలి అన్ని దానికి ఆ అల్లరి విద్యార్ధి చెప్పిన కారణం చూస్తే... పడిపడి నవ్వాల్సిందే.. ఈ లెటర్ పై ప్రిన్సిపాల్ స్పందన ఏంటీ..ఈ విచిత్ర ఘటన ఎక్కడ జరిగింది ఎలా వెలుగులోకి వచ్చిందో ..వివరాల్లోకి వెళితే..
ఈ హాస్యాస్పద దరఖాస్తుకు సంబంధించిన లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్లాస్ లో ఉన్న బాయ్స్ అంతా కలిసి ప్రిన్సిపాల్ కు లెటర్ పెట్టారు. అందులో ఏముందంటే.. గర్ల్స్ అంతా ముందు రెండు వరసల్లో కూర్చుంటున్నారు.. వారి లాంగ్ హెయిర్ మా డెస్క్ లపై పడుతోంది.. అంతేకాదు.. మేం పాఠాలు వినేందుకు, బోర్డు వైపు చూసేందుకు అడ్డుగా వస్తోంది. దీంతో మేం ఇబ్బంది పడుతున్నాం.. అని రాసి ఇట్లు క్లాస్ స్టూడెంట్స్ అని రాశారు.
ఈ విచిత్ర మైన లెటర్ ను ఓ X సోషల్ మీడియాలో యూజర్ ఒకరు తన బ్లాగ్ లో పోస్ట్ చేశారు. మా తమ్ముడు , అతని క్లాస్ మేట్స్ కలిసి అమ్మాయిలగురించి ఇలా ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు. అని రాశారు. ఈ పోస్ట్ రీచ్ అయిన వెంటనే 5లక్షల మంది ఈ పోస్ట్ ను చూశారు. 8వేల 400 మంది లైకులు కూడా కొట్టారు. అంతేకాదు విద్యార్థుల లెటర్ పై తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పారు.
నేను పగలబడి నవ్వుకున్నాను..ప్రిన్సిపాల్ శృతి మామ్ కూడా బాగా నవ్వుకుని ఉంటారు.. మీ బ్రదర్ కు ఓ హగ్ ఇవ్వాలి..చాలా క్యూట్, స్మార్ట్ అంటూ ఓ నెటిజెన్ విద్యార్థిపై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ పెట్టింది.
ఇంకో నెటిజన్ స్పందిస్తూ. విద్యార్థుల డిమాండ్ న్యాయమైనదే.. ఎవరైనా వెంట్రుకలను తమ నోట్ బుక్ లో ఉంచుకోవాలని అనుకుంటారా.. అని రాశారు.
నా గత జ్ణాపకాలను గుర్తు చేసింది ఈ ట్వీట్ అంటూ మరో నెటిజన్ రాశాడు.
ఇక కొందరైతే లెటర్ లో రాసిన రాత గురించి మెచ్చుకున్నారు.. వావ్ .. ఎంత చక్కగా ఎలాంటి తప్పులు లేకుండా ఇంగ్లీషులో రాశారు .. కానీ ఒక తప్పు చేశారు.. అందేంటంటే.. శృతి మాడమ్ కు ఇవ్వడం అని హాస్యాస్పదంగా స్పందించారు నెటిజన్లు.