రెండో రోజు కొనసాగిన స్కూల్ బస్సుల తనిఖీలు

రెండో రోజు కొనసాగిన స్కూల్ బస్సుల తనిఖీలు
  • ఫిట్‌‌నెస్‌‌ లేని 165 వాహనాలపై కేసులు, 40 బస్సులు సీజ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మంగళవారం రెండో రోజు కూడా స్కూల్ బస్సులపై  రవాణా శాఖ అధికారుల తనిఖీలు కొనసాగాయి. నిబంధనలు ఉల్లంఘించిన పలు విద్యా సంస్థలకు చెందిన 165 వాహనాలపై కేసులు నమోదు చేయగా, 40 బస్సులను అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్ సిటీలో అత్యధికంగా 49 బస్సులపై, ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 21 బస్సులపై, రంగారెడ్డిలో 19 బస్సులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కరీంనగర్‌‌‌‌ జిల్లాలో రూల్స్ ఉల్లఘించిన అధికార పార్టీ నేత విద్యా సంస్థ బస్సులపై కూడా కేసులు నమోదు చేశామన్నారు.