V6 News

సెలవుల్లో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్

సెలవుల్లో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్

హైదరాబాద్, వెలుగు: స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ సెలవులు తీసుకున్నారు. ఆయనకు శనివారం నుంచి ఈ నెల 31 వరకూ వ్యక్తిగత సెలవులు మంజూరు చేస్తూ సీఎస్ కే.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. 

నవీన్ తిరిగి విధుల్లో చేరేంత వరకు డైరెక్టర్ పోస్టు బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే, లీవ్ అయిపోయాక ఆయన తిరిగి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానే బాధ్యతలు స్వీకరిస్తారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.