Smriti Mandhana Era: భారత మహిళా క్రికెట్లో ఒక కొత్త శకం ప్రారంభం కానుంది. కొత్త కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) సారథ్యంలో టీమిండియా రేపు (అక్టోబర్ 16, శుక్రవారం) రాయ్‌పూర్ వేదికగా జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. అంతర్జాతీయ క్రికెట్లో భారత్, జింబాబ్వే జట్లు ద్విపాక్షిక సిరీస్‌లో (Bilateral Series) ఎదురుకావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఆసియా స్థాయిలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నప్పటికీ, పొట్టి ఫార్మాట్లో (T20s) టీమిండియా ఇంకా మెరుగవ్వాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీని లక్ష్యంగా పెట్టుకున్న ఇండియా, ఈ సిరీస్ ద్వారా తమ లోపాలను సరిదిద్దుకోవాలని చూస్తోంది.
భారత్ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు:
* గత టీ20 ప్రపంచ కప్‌లలో ఆశించిన మేర రాణించలేకపోవడం భారత జట్టు బలహీనతలను బయటపెట్టింది.
* మిడిల్ ఓవర్లలో మందగమనం: ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలి వర్మ ఇస్తున్న మెరుపు ఆరంభాన్ని మిడిల్ ఓవర్లలో కొనసాగించడంలో బ్యాటర్లు తడబడుతున్నారు.
* మూడో స్థానంలో మార్పులు: మూడో నంబర్ స్థానం కోసం అనేక ప్రయోగాలు జరుగుతుండగా.. మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పేలవ ఫామ్ జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం ఆమె కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే ఆడుతుండటంపై ఒత్తిడి నెలకొంది.
* లోయర్ ఆర్డర్ పవర్ హిట్టర్లు: రిచా ఘోష్‌కు తోడుగా లోయర్ ఆర్డర్లో భారీ షాట్లు కొట్టే పవర్ హిట్టర్లను తయారు చేయాల్సిన అవసరం ఉంది.
ఫీల్డింగ్, పేస్ బౌలింగ్ లోపాలు: ఫీల్డింగ్‌లో నిలకడలేమి జట్టును తరచూ దెబ్బతీస్తోంది. స్పిన్ విభాగం బలంగా ఉన్నప్పటికీ, పేస్ అటాక్‌లో పదును పెరగాలి.. యువ సంచలనం నందిని శర్మ రాణిస్తుండటం సానుకూలాంశం.
జింబాబ్వేతోనే ఫస్ట్ సవాల్:
* కొత్త ఆటగాళ్లకు ఛాన్స్: శ్రీ చరణి స్పిన్ ప్రదర్శన ఆకట్టుకోగా.. లెగ్ బ్రేకర్ బౌలర్ ప్రేమా రావత్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ జట్టులో నికి ప్రసాద్, జింతిమణి కలిత లాంటి కొత్త ముఖాలకు చోటు దక్కింది.
* జింబాబ్వే జోరు: జోసెఫిన్ ఎన్కోమో (Josephine Nkomo) నాయకత్వంలో బరిలోకి దిగుతున్న జింబాబ్వే జట్టు, గత నెలలో వెస్టిండీస్‌పై వన్డే విజయం సాధించిన జోరు మీద ఉంది. కాబట్టి ఈ టూర్‌ను తక్కువ అంచనా వేయలేం.
* ఈ టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ఇరు జట్లు వడోదర (Vadodara) వేదికగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తలపడనున్నాయి.
Captain Smriti Mandhana Talking About on her batting and Captaincy 🇮🇳 https://t.co/yDXhZJDqzG
— Manmohan (@GarhManmohan) October 15, 2026
