PM Modi Asian Games Meeting: జపాన్‌లోని ఐచి-నాగోయా (Aichi-Nagoya) వేదికగా ముగిసిన ఆసియా క్రీడలు 2026 (Asian Games 2026) లో అద్భుత ప్రదర్శనతో దేశానికి గర్వకారణంగా నిలిచిన భారత క్రీడా బృందాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా అభినందించనున్నారు. ఈరోజు (2026, అక్టోబర్ 15, గురువారం) సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోడీ అథ్లెట్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ వేడుకలో భారత ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధికారులు, క్రీడా మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ పాల్గొననున్నారు.
85 పతకాలతో పాయింట్ల పట్టికలో 4వ స్థానం:
ఈసారి ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు సత్తా చాటి మొత్తం 85 పతకాలు (21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలు) సాధించి, పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచారు. ఆసియా క్రీడల చరిత్రలో భారత్‌కు ఇది రెండో అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం.
ఐచి-నాగోయా 2026లో భారత్ రికార్డులు:
* హాకీలో డబుల్ గోల్డ్: ఒకే ఆసియాడ్ ఎడిషన్‌లో పురుషుల, మహిళల హాకీ జట్లు రెండూ స్వర్ణ పతకాలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాయి.
* ఆర్చరీలో సంచలనం: ఆర్చరీలో ఏకంగా 5 స్వర్ణాలతో సహా 9 పతకాలు సాధించారు. కుమ్కుమ్ మోహోద్ విమెన్స్ ఇండివిజువల్ రికర్వ్‌లో స్వర్ణం సాధించడంతో పాటు LA 2028 ఒలింపిక్ క్వాలిఫికేషన్ (Quota) సాధించింది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చికిత తనిపర్తి, సాహిల్ జాదవ్ జోడీ స్వర్ణంతో మరొక ఒలింపిక్ స్థానాన్ని సొంతం చేసుకుంది.
* గోల్ఫ్‌లో గోల్డ్: ప్రణవి అర్స్ మహిళల వ్యక్తిగత గోల్ఫ్ విభాగంలో స్వర్ణం సాధించి, 24 ఏళ్ల భారత్ నిరీక్షణకు తెరదించింది. అంతేకాకుండా అదితి అశోక్, దీక్షా డాగర్లతో కలిసి విమెన్స్ టీమ్ ఈవెంట్లోనూ రజతం సాధించింది.
* అథ్లెటిక్స్ ఆధిపత్యం: భారత్‌కు అత్యధికంగా అథ్లెటిక్స్‌లోనే 24 పతకాలు లభించాయి.
* సుదీర్ఘ నిరీక్షణకు తెర: వెయిట్‌లిఫ్టింగ్‌లో 28 ఏళ్ల తర్వాత, గ్రీకో-రోమన్ రెజ్లింగ్‌లో ఏకంగా 64 ఏళ్ల తర్వాత భారత్ ఫైనల్స్ చేరి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. మహిళల ట్రాప్ షూటింగ్, సాఫ్ట్ టెన్నిస్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) విభాగాల్లోనూ ఇండియా తొలిసారి పతకాలను దక్కించుకుంది.
* సత్తా చాటిన టీమిండియా ఉమెన్స్: ఆసియా గేమ్స్ లో భారత మెన్/ ఉమెన్స్ జట్లు మరోసారి సత్తాచాటాయి. హర్మన్ ప్రీత్ కౌర్ సాథర్యంలో ఆసియా గేమ్స్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టును 147 పరుగుల తేడాతో భారీగా ఓడించి టీమిండియా బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.
* రెండోసారి భారత్ స్వర్ణం: అక్టోబర్ 3, 2026 న జపాన్‌లోని ఐచి-నగోయా (Aichi-Nagoya) లో జరిగిన పురుషుల క్రికెట్ ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో, శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా పాకిస్తాన్‌ను 19 పరుగుల తేడాతో ఓడించి ఈ ఘనతను అందుకుంది. ఈ విజయంతో ఏషియన్ గేమ్స్ క్రికెట్ విభాగంలో భారత్ వరుసగా రెండోసారి స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుని తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
*హైదరాబాద్ (ఉప్పల్) వేదికగా వెస్టిండీస్ తో నాలుగో టీ20 మ్యాచ్ లో ఓడిపోయిన భారత్, ఈ పరాజయం తర్వాత సక్కగా ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్వర్యంలో జరగనున్న భేటీ కోసం నేరుగా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పయనం అయ్యారు.
Prime Minister @narendramodi will interact with the Indian contingent that participated in the Asian Games 2026 in New Delhi today and address the gathering. India secured 4th place in the medal tally at the Aichi-Nagoya Asian Games in Japan, winning 85 medals, including 21 gold, 27 silver and 37 bronze. This marks India’s second consecutive finish among the top five nations at the Asian Games. #AsianGames2026 #TeamIndia
— All India Radio News (@airnewsalerts) October 15, 2026
