హైదరాబాద్ చుట్టూ మోపైన కల్తీ పాల ఉత్పత్తుల కేంద్రాలు.. TG SAFE రైడ్స్లో షాకింగ్ విషయాలు!

హైదరాబాద్ చుట్టూ మోపైన కల్తీ పాల ఉత్పత్తుల కేంద్రాలు..  TG SAFE రైడ్స్లో షాకింగ్ విషయాలు!

హైదరాబాదీలే టార్గెట్గా కల్తీ పాల ఉత్పత్తులు తయారు చేస్తూ జనాల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు కొందరు. ఐస్ క్రీమ్స్, స్వీట్లు, కోవా, లడ్డూలు అంటూ రకరకాల మిఠాయిలు తయారు చేస్తూ హైదరాబాదీలకు అమ్ముతూ ఆరోగ్యాలను గాలికి వదిలేసి సంపాదిస్తున్నారు.

2026 అక్టోబర్ 15న హైదరాబాద్ చుట్టుపక్కల CURE పరిధిలో TG SAFE ఫుడ్ వింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. 6 డెయిరీ ఉత్పత్తుల తయారీ కేంద్రాల్లో సోదాలు నిర్వహించారు. మరో ట్రాన్స్‌పోర్ట్ ప్రదేశంలోనూ అధికారుల తనిఖీలు జరిపారు. 

అపరిశుభ్ర పరిసరాల్లో డెయిరీ ఉత్పత్తుల తయారీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. FSSAI లైసెన్స్ లేకుండానే డెయిరీ యూనిట్ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సరైన ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయని డెయిరీ ఉత్పత్తులు చూసి షాకయ్యారు. 

కోల్డ్ స్టోరేజ్ లేకుండానే బస్సులు, DCM వాహనాల్లో రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఎలాంటి పరిశుభ్రత చర్యలు తీసుకోకుండా ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి తరలిస్తున్నారు. బస్సుల్లో తరలిస్తున్న 3.6 టన్నుల కోవా సీజ్ చేశారు. నిబంధనల ఉల్లంఘనలపై కొన్ని యూనిట్ల మూసివేతకు చర్యలు తీసుకుంటున్నారు.