టీమిండియా ఓటమికి అక్కడే పునాది పడింది.. కుండబద్ధలు కొట్టిన శ్రేయాస్ అయ్యర్

టీమిండియా ఓటమికి అక్కడే పునాది పడింది.. కుండబద్ధలు కొట్టిన శ్రేయాస్ అయ్యర్

టీమిండియా, వెస్టిండీస్ మధ్య జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది. మన జట్టు ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ అనంతరం కీలక వ్యాఖ్యలు చేశాడు. ఛేజింగ్లో టీమిండియా ఎక్కడ వెనుకబడిందో వివరిస్తూ.. ఇదంతా బౌలింగ్తోనే మొదలైందని చెప్పాడు.

బౌలింగ్లో లైన్ అండ్ లెంగ్త్ స్ట్రాటజీని సరిగ్గా అమలు చేయలేకపోయామని, మన బౌలింగ్ పేలవంగా సాగిందని, అక్కడే టీమిండియా ఓటమికి పునాది పడిందని అయ్యర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఛేజింగ్లో తమ ఆట తీరు తనకు నచ్చిందని, కానీ బౌలర్లుగా తాము వ్యూహాన్ని సరిగ్గా అమలు చేయలేకపోయామని, అక్కడే తాము కొంచెం వెనుకబడ్డామని శ్రేయాస్ అయ్యర్ చెప్పాడు.

టీమిండియా బౌలింగ్ సాగిందిలా:
తొలుత బ్యాటింగ్‌‌కు దిగిన విండీస్‌‌ను కట్టడి చేయడంలో ఇండియా బౌలర్లు చేతులెత్తేయగా, హోప్‌‌ ఈ సిరీస్‌‌లో రెండో సెంచరీతో భారీ స్కోరు అందించాడు. తొలి ఓవర్‌‌లో మూడు రన్స్‌‌తో సరిపెట్టినా.. తర్వాత ఫోర్లు, సిక్సర్ల జాతర చూపెట్టాడు. రెండో ఓవర్‌‌లో జెవెల్‌‌ ఆండ్రూ (21) 6, 4, 4తో 17 రన్స్‌‌ దంచాడు. మూడో ఓవర్‌‌లో 6, 4తో టచ్‌‌లోకి వచ్చిన హోప్‌‌.. నాలుగో ఓవర్‌‌లోనూ రిపీట్‌‌ చేశాడు.

అయితే ఐదో ఓవర్‌‌లో అక్షర్‌‌ పటేల్‌‌ (1/45) దెబ్బకు ఆండ్రూ ఔట్‌‌ కావడంతో తొలి వికెట్‌‌కు 52 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. ఆ తర్వాత హోప్‌‌  సిక్సర్‌‌, హెట్‌‌మయర్‌‌ (33) 4, 4, 6తో పవర్‌‌ప్లేలో విండీస్‌‌ 79/1 స్కోరు చేసింది. ఫీల్డింగ్‌‌ పెరిగిన తర్వాత కూడా హెట్‌‌మయర్‌‌ రెండు ఫోర్లతో బ్యాట్‌‌ ఝుళిపించాడు. 8వ ఓవర్‌‌లో హోప్‌‌ 6, 4, హెట్‌‌మయర్‌‌ 6తో 19 రన్స్‌‌ వచ్చాయి. కానీ 9వ ఓవర్‌‌లో హెట్‌‌మయర్‌‌ ఔట్‌‌తో రెండో వికెట్‌‌కు 58 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది.

తొలి పది ఓవర్లలో విండీస్‌‌ 118/2తో పటిష్ట స్థితిలో నిలిచింది. 11వ ఓవర్‌‌లో సిక్స్‌‌తో హోప్‌‌ 28 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేశాడు. 12వ ఓవర్‌‌లో పావెల్‌‌ (24) 4, 6, 4, హోప్‌‌ 6తో 22 రన్స్‌‌ వచ్చాయి. 13వ ఓవర్‌‌లో పావెల్‌‌ వెనుదిరిగినా.. హోప్‌‌ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. సింగిల్స్‌‌తో కుదురుకున్న రూథర్‌‌ఫోర్డ్‌‌ తర్వాత బ్యాట్‌‌ ఝుళిపించాడు. దాంతో 15 ఓవర్లలో స్కోరు 177/3కి పెరిగింది.

17వ ఓవర్‌‌లో హోప్‌‌ 4, రూథర్‌‌ఫోర్డ్‌‌ 6, 4, 6తో 22 రన్స్‌‌ వచ్చాయి. సెంచరీకి చేరువైన హోప్‌‌ చివర్లో ఒక ఫోర్‌‌, రెండు సిక్స్‌‌లతో 50 బాల్స్‌‌లో ట్రిపుల్‌‌ డిజిట్‌‌ స్కోరును అందుకున్నాడు. రూథర్‌‌ఫోర్డ్‌‌తో నాలుగో వికెట్‌‌కు 91 రన్స్‌‌ జోడించడంతో విండీస్‌ 247 పరుగుల భారీ స్కోరు చేసింది. టీమిండియా 248 పరుగుల లక్ష్య సాధనలో 223 పరుగులకే ఆలౌట్ అయింది.