ప్రైవేట్ స్కూల్ లో విద్యార్థులతో వెట్టిచాకిరి

ప్రైవేట్ స్కూల్ లో విద్యార్థులతో వెట్టిచాకిరి

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే చిన్నారులతో వెట్టి చాకిరి చేస్తున్నారు. పాఠాలు చెప్పాల్సింది పోయి వాళ్లతో పనులు చేయిస్తున్నారు. సంగారెడ్డిలోని ఓ ప్రైవెట్ రెసిడెన్షియల్ పాఠశాలలో… విద్యార్థులతో వాటర్ ట్యాంక్ క్లీన్ చేయిస్తున్నారు అక్కడి ఉపాధ్యాయులు.  నాలుగంతస్థుల ఎత్తున్న ట్యాంక్ ఎక్కేందుకు చిన్నారులు కష్టపడుతున్నారు. ప్రమాదకర స్థితిలో వాటర్ ట్యాంక్ ఎక్కడం, దిగడం చేస్తున్నారు. పది మంది పిల్లలు ట్యాంక్ ను క్లీన్ చేయడం కోసం పైకెక్కారు. ట్యాంక్ లోని నీటిని బకెట్లతో తోడుతూ.. నాచును తొలగించారు. పిల్లలతో ట్యాంక్ కడిగించడమేంటని ప్రిన్సిపల్ రాజును స్థానికులు ప్రశ్నించగా… కడిగితే తప్పేంటని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఈ ఘటనపై స్పందించేందుకు ఉన్నతాధికారులు కూడా ముందుకు రాలేదు.

ప్రిన్సిపల్ రాజు….. ఇదే స్కూళ్లో హాస్టల్ పిల్లలతో నీళ్ల ట్యాంకులను శుభ్ర పరచడం, గుంతలు తవ్వించడం, కాంపౌండ్ వాల్ ను కూల గొట్టించడం వంటి పనులు చేయిస్తున్నారు. పిల్లలను బలవంత పెట్టి మరీ వెట్టి చాకిరీ చేయిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.