ప్రజల సహకారంతో బడుల అభివృద్ధి ... విద్యా శాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి

ప్రజల సహకారంతో బడుల అభివృద్ధి ... విద్యా శాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి

ఇబ్రహీంపట్నం, వెలుగు: సర్కార్​ బడుల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరమని విద్యా శాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని అరుట్ల, మంచాల తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ.. కార్పొరేట్ కు దీటుగా సర్కార్​ స్కూళ్లను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యా కమిషన్​ సభ్యులు జ్యోష్న, పద్మజ, డీఈవో సుశీందర్​ రావు, ఎంఈవో రాంధాస్​  పాల్గొన్నారు.