చలిగాలుల ఎఫెక్ట్.. జనవరి 20వరకు ఆ తరగతి వరకు స్కూల్స్ బంద్

చలిగాలుల ఎఫెక్ట్.. జనవరి 20వరకు ఆ తరగతి వరకు స్కూల్స్ బంద్

చండీగఢ్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో జనవరి 20 వరకు 8వ తరగతి వరకు ఫిజికల్ మోడ్‌లో తరగతులు నిలిచిపోనున్నాయి. ఉత్తర భారతదేశంలో చలిగాలులు కొనసాగుతున్నందున డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ ప్రకటన జారీ చేశారు. ఈ ప్రాంతంలో వాతావరణం చల్లగా ఉండడంతో UT పరిపాలన పాఠశాల విద్యార్థులకు సెలవులను పొడిగించింది. జనవరి 13న జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, జనవరి 20 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 8వ తరగతి తరగతులు నిర్వహించరాదు. అదే సమయంలో విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించవచ్చని వెల్లడించింది.

ప్రస్తుతం ఉన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పిల్లలు ఈ తీవ్రమైన శీతల వాతావరణానికి గురికాకుండా ఉండటానికి జనవరి 20 వరకు UT చండీగఢ్‌లోని ప్రభుత్వ, ప్రభుత్వ-ఎయిడెడ్, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో 8వ తరగతుల విద్యార్థులకు తరగతులు ఉండవు. పాఠశాలలు ఈ తరగతుల విద్యార్థుల కోసం ఆన్‌లైన్ తరగతులను నిర్వహించవచ్చని అధికాురులు ఉత్తర్వులో పేర్కొన్నారు.

ఉన్నత తరగతులకు..

చండీగఢ్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 9 - 12వ తరగతి విద్యార్థులకు తరగతులు కొనసాగుతున్నాయి. అయితే చలి గాలుల కారణంగా పాఠశాలలను ఉదయం 9.30 కంటే ముందుగా.. సాయంత్రం 4 గంటల తర్వాత తెరవకూడదని ఆదేశాలు జారీ చేశారు.