అబ్దుల్ కలాంకు ఘన నివాళి

అబ్దుల్ కలాంకు ఘన నివాళి

గూడూరు/రఘునాథపల్లి, వెలుగు : శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌‌ కలాం జయంతిని ఆదివారం మహబూబాబాద్‌‌ జిల్లా గూడూరు, జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కొమ్మాలలో నిర్వహించారు. గూడూరులో జడ్పీ కో ఆప్షన్‌‌ సభ్యుడు, వాకర్స్‌‌ అసోసియేషన్‌‌ గౌరవ అధ్యక్షుడు ఖాసీం, కొమ్మాలలో బీజేపీ స్టేషన్‌‌ ఘన్‌‌పూర్‌‌ నియోజకవర్గ ఇన్‌‌చార్జి ఇన్‌‌చార్జి పెరుమాండ్ల వెంకటేశ్వర్లు హాజరై కలాం ఫొటో వద్ద నివాళి అర్పించారు.

గూడూరులో లక్ష్మణ్‌‌నాయక్‌‌, గోపీనాథ్‌‌, శ్రీను, వెంకటేశ్వర్లు, కొమ్మాలలో మంద వెంకటేశం యాదవ్, వల్లాల ఉపేందర్, చందర్‌‌నాయక్‌‌, రంగు రాజశేఖర్‌‌ పాల్గొన్నారు.