Health Alert : సడెన్ గుండెపోటు ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావొచ్చు.. ఒక్క కొలస్ట్రాల్ వల్లే అని చెప్పలేం..!

Health Alert : సడెన్ గుండెపోటు ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావొచ్చు.. ఒక్క కొలస్ట్రాల్ వల్లే అని చెప్పలేం..!

ఒకప్పుడు గుండెపోటు అనేది చాల అరుదుగా కొందరికి మాత్రమే వచ్చేది. గుండెపోటు వల్ల మరణాల కూడా తక్కువే. ముఖ్యంగా ఈ గుండెపోటు 60 ఏళ్ళు పై బడిన వారిలో లేద వృద్ధుల్లోనే కనిపించేది. కానీ ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయస్సుల్లో వారికీ మరణాన్ని పరిచయం చేయిస్తుంది. అసలు గుండెపోటు ఎప్పుడు, ఎలా వస్తుందో సంకేతాలు లేకుండా కూడా ప్రాణాలు వదులుతున్నారు.

అయితే గుండెపోటు అనేది కేవలం కొలెస్ట్రాల్ వల్ల మాత్రమే కాకుండా, శరీరంలో దాగి ఉన్న బ్యాక్టీరియా వల్ల కూడా రావొచ్చని సైంటిస్టులు ఒక కొత్త అధ్యయనం ద్వారా బయటపెట్టారు. వైరల్ ఇన్ఫెక్షన్ల తర్వాత ఈ బ్యాక్టీరియా ఆక్టీవ్ గా మారి గుండెపోటుకు కారణం కావచ్చు. ఈ పరిశోధన గుండెపోటు నివారించడానికి టీకాలు కూడా అభివృద్ధి చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

ఫిన్లాండ్, యూకే పరిశోధకులు చేసిన ఈ అధ్యయనం ప్రకారం, గుండెపోటు (మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్) ఒక రకమైన అంటువ్యాధి కావచ్చని మొదటిసారిగా రుజువు చేశారు.  గుండె ధమనులలో కొలెస్ట్రాల్‌తో కూడిన ఫలకాలు కొన్నేళ్లుగా పేరుకుపోతాయి. ఈ ఫలకాలలో బ్యాక్టీరియా బయోఫిల్మ్‌ను ఏర్పరుస్తుంది. ఈ బయోఫిల్మ్‌లోని బ్యాక్టీరియా నిద్రలో ఉంటుంది, దాని చుట్టూ ఉన్న పొర కారణంగా మన శరీర రోగనిరోధక వ్యవస్థ, యాంటీబయాటిక్స్ కూడా దానిని నాశనం చేయలేవు.

ఒక వైరల్ ఇన్ఫెక్షన్ లేదా ఇతర కారణాల వల్ల ఈ బయోఫిల్మ్ మేల్కొంటే, బ్యాక్టీరియా పెరిగి మంటను పుట్టిస్తుంది. ఈ మంట వల్ల ఫలకం పై పొర చిరిగిపోయి, రక్తం గడ్డకట్టి గుండెపోటు వస్తుంది. ప్రొఫెసర్ పెక్కా కర్హునెన్ ఈ పరిశోధన ద్వారా ఇంతకు ముందు గుండె జబ్బులు ఆక్సిడైజ్డ్ LDL కొలెస్ట్రాల్ వల్ల మాత్రమే వస్తాయని అనుకునేవారని తెలిపారు. 

పరిశోధకులు గుండె ధమనుల కణజాలంలో నోటిలో ఉండే బ్యాక్టీరియా జన్యు పదార్థం (DNA) ఉందని తెలుసుకున్నారు. ఈ బ్యాక్టీరియాను లక్ష్యంగా చేసుకుని ఒక యాంటీబాడీని అభివృద్ధి చేశారు. ఈ యాంటీబాడీ వాడడం వల్ల ధమనుల్లో దాగి ఉన్న బయోఫిల్మ్ నిర్మాణాలు బయటపడ్డాయి. గుండెపోటు వచ్చిన వారిలో ఈ బయోఫిల్మ్‌ల నుండి బ్యాక్టీరియా బయటకు వచ్చినట్లు గమనించారు. అప్పుడు రోగనిరోధక వ్యవస్థ ఆ బ్యాక్టీరియాతో పోరాడటానికి ప్రయత్నించి మంటను పెంచుతుంది. ఈ మంట వల్లనే ఫలకం చిరిగిపోయి గుండెపోటు వస్తుంది. ఈ పరిశోధన కొత్త రకాల రోగాలు, చికిత్సకు దారి తీస్తుంది. గుండెపోటును నివారించడానికి టీకాలు తయారు చేసే అవకాశం కూడా పెరుగుతుంది.

ఈ అధ్యయనాన్ని టాంపెరే, ఔలు యూనివర్సిటీస్, ఫిన్నిష్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ వెల్ఫేర్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కలిసి నిర్వహించాయి. గుండెపోటుతో చనిపోయిన వారి నుండి అలాగే ధమనుల  శస్త్రచికిత్స చేయించుకుంటున్న వారి నుండి కణజాల నమూనాలతో ఈ పరిశోధన జరిగింది. దీనికి యూరోపియన్ యూనియన్, ఇతర సంస్థల నుండి నిధులు లభించాయి.