
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సెమి కండక్టర్ లేబరేటరీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఎస్సీఎల్ వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ మే 26.
పోస్టులు: 25 (అసిస్టెంట్)
ఎలిజిబిలిటీ: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 25 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏండ్లు వయోపరిమతిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్ డ్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీలకు రూ.800. మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్ సర్వీస్మెన్/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.400. ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.
- అప్లికేషన్ ప్రారంభం: మే 17.
- లాస్ట్ డేట్: జూన్ 26.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్షలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు w w w . s c l . g o v . i n వెబ్సైట్లో సంప్రదించగలరు.