షాంఘై సమిట్ కోసం ఉజ్బెకిస్తాన్​కు మోడీ

షాంఘై సమిట్ కోసం ఉజ్బెకిస్తాన్​కు మోడీ

న్యూఢిల్లీ : ఉజ్బెకిస్తాన్​లోని సమర్ఖండ్​లో గురు, శుక్రవారాల్లో షాంఘై కోఆపరేటివ్ సమ్మిట్(ఎస్​సీఓ) జరగనుంది. దీనికి ప్రధాని మోడీ, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, చైనా ప్రెసిడెంట్ జీ జిన్ పింగ్, పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ తదితరులు హాజరవుతున్నారు. సమిట్ సందర్భంగా పుతిన్​తో మోడీ భేటీ అవుతారని రష్యా ప్రకటించింది. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారని తెలిపింది. ఏసియా పసిఫిక్ రీజియన్ లో పరిస్థితి, యునైటెడ్ నేషన్స్, జీ20, ఎస్ సీవోలలో సహకారంపై చర్చిస్తారని చెప్పింది. అయితే పుతిన్ తో మోడీ మీటింగ్ పై మన విదేశాంగ శాఖ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు, జీ జిన్ పింగ్, షెబాజ్ షరీఫ్​లతోనూ మోడీ మీటింగ్​పై ఇంకా క్లారిటీ రాలేదు. 

మోడీతో భూటాన్ రాజు భేటీ..
భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌‌గేల్ వాంగ్‌‌చుక్ ఢిల్లీలో బుధవారం ప్రధాని మోడీతో భేటీ అయ్యా రు. బ్రిటన్ రాణి అంత్యక్రియలకు లండన్ వెళ్తున్న వాంగ్ చుక్.. బుధవారం ఢిల్లీలో ఆగారు.