
ఉప్పల్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీ పై వెళ్తున్న హొలీమేరీ ఇంజనీరింగ్ విధ్యార్థినులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో స్నేహ అనే విధ్యార్థిని మృతి చెందగా.. మరో అమ్మాయి గాయపడింది. ఉప్పల్ గాంధీ విగ్రహం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆక్సిడెంట్ జరిగిన వెంటనే.. స్థానికంగా ఉన్న ట్రాఫిక్ పోలీసులు, ప్రజలు స్పంధించారు. గాయపడిన అమ్మాయిని హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.