సూపర్ కార్ రీల్స్ చేస్తూ..బైక్స్పై నుంచి పడ్డారు

సూపర్ కార్ రీల్స్ చేస్తూ..బైక్స్పై నుంచి పడ్డారు

కార్లంటే ఇంత పిచ్చా..ఎంత నచ్చితే మాత్రం బిజీగా ఉన్న రోడ్లపై డ్రైవ్ చేస్తూ మరీ వీడియో తీయాలా..కిందపడి  మోకాళ్లు, మోచేతులు విరగ్గొట్టుకోవాలా.. ఇంకా కొంచెం ఉంటే ప్రాణాలే పోయేవీ.. బెంగళూరులో బిజీ రోడ్లపై జరిగిన ఓ ఇన్సిడెంట్ సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు చేస్తున్న కామెంట్లు.. నిత్యం బిజీగా ఉంటే బెంగుళూరు సిటీ లో రోడ్లపై సూపర్ కార్ వెళ్తుండగా ఇద్దరు బైక్ రైడర్లు వీడియో తీసేందుకు యత్నంచి బొర్లాబొక్కల పడ్డారు.. దీనిని వీడియో తీసి ఓ నెటిజన్ X లో పోస్ట్ చేశాడు. ఈ వీడియా ఇప్పుడు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది.  

బెంగుళూరు సిటీలో రోడ్లపై వెళ్తున్న సూపర్ కారును వీడియో రికార్డింగ్ చేసేందుకు యత్నించి ఇద్దరు స్కూటీ రైడర్లు కిందపడ్డారు.. వారి అదృష్టం బాగుండి.. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు.. కొంచెం అటు ఇటు అయినా ప్రాణాలే పోయేవి. ఈ దృశ్యాలను ఓ వ్యక్తి తన సెల్ కెమెరాల  బంధించి సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ X లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు బిజీ రోడ్లపై వీడియో ఏంటీ..  అని ఓ రేంజ్ క్లాస్ పీకుతున్నారు. 

రైడర్లు సూపర్ కారు వీడియో తీస్తూ తాము రోడ్డుపై ఉన్నామన్న విషయాన్నే మర్చిపోయారు.. దీంతో వెనకనుంచి వస్తున్న బైక్ ను గమనించకపోవడంతో రోడ్డుపై పడిపోయారు. బైకర్ స్కూటీని ఢీకొట్టడంతో రైడర్ల కిందపడ్డారు. 

ALSO READ :- టాటా కమ్యూనికేషన్స్‌తో మైక్రోసాఫ్ట్ టైఅప్.. కాల్ కనెక్టివిటీ పెరుగుతుందట..

ఫిబ్రవరి 6న ఈ వీడియోను X లో పోస్ట్ ఓ నెటిజన్ పోస్ట్ చేయగా.. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. రీల్స్ పిచ్చి కారణంగా రహదారి భద్రత సమస్యల గురించి ఆందోళన వ్యక్తం చేశారు.