దక్షిణ మధ్య రైల్వేకు 7 అవార్డులు

దక్షిణ మధ్య రైల్వేకు 7 అవార్డులు

సికింద్రాబాద్​, వెలుగు:  ‘తెలంగాణ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్–2023’లో భాగంగా సౌత్ సెంట్రల్  రైల్వే 5 అవార్డులను దక్కించుకుంది. అదే విధంగా ‘ఆంధ్రప్రదేశ్ స్టేట్ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్– 2023’లో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వేకు 2 అవార్డులు దక్కాయి. బుధవారం ఖైరతాబాద్​లోని విశ్వేశ్వరయ్య భవన్​లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి, విజయవాడలోని వివంతా హోటల్​లో జరిగిన కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వం నుంచి రైల్వే అధికారులు ఈ అవార్డులను అందుకున్నారు. రైల్వే స్టేషన్ భవనాల విభాగంలో నల్గొండ రైల్వేస్టేషన్​కు గోల్డ్ అవార్డు, ప్రభుత్వ భవనాల విభాగంలో లేఖా భవన్​కు గోల్డ్, రైల్వే స్టేషన్ భవనాల విభాగంలో కాచిగూడకు సిల్వర్, ప్రభుత్వ భవనాల విభాగంలో హైదరాబాద్‌‌లోని ప్యాసింజర్‌‌‌‌ రిజర్వేషన్ సిస్టమ్‌‌ భవనానికి సిల్వర్, లాలాగూడలోని వర్క్‌‌షాపునకు సిల్వర్ అవార్డులు దక్కాయి. ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే మేనేజర్ అరుణ్​కుమార్ జైన్ ఆయా డివిజన్లకు చెందిన రైల్వే మేనేజర్లు, సిబ్బంది అభినందించారు.