బలగం సినిమాను చూసి ఊరంతా ఎమోషనల్

 బలగం సినిమాను చూసి ఊరంతా ఎమోషనల్


బలగం...  ఇప్పుడు ఏ ఇద్దరు సీని లవర్స్ కలిసిన మాట్లాడుకునేది ఈ  సినిమా గురించే...  చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం పెద్ద ప్రభంజనమే సృష్టించింది. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ .. మానవ సంబంధాలను అత్యంత  సహజంగా తెరకెక్కి్ంచారు. ఓటీటీలోకి ఈ సినిమా వచ్చినప్పటికి ప్రేక్షకులు ఇంకా థియేటర్ లోకి వెళ్లి చూస్తున్నారు. అయితే ఈ సినిమాను అందరూ చూడాలని కొందరు గ్రామస్థులు తమ గ్రామంలో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. 

శంషాబాద్ మండల పరిధి కవ్వగూడ గ్రామంలో  బలగం సినిమాని చూసేందుకు ఆ గ్రామ సర్పంచ్ రమేష్ యాదవ్ ఏర్పాటు చేశారు. ఈ సినిమాను చూడడానికి  ఐదు సంవత్సరాల చిన్నారుల నుండి 60 , 70 సంవత్సరాల వృద్ధుల కూడా తరలివచ్చారు.  దాదాపుగా1500 నుండి 2000వేల మంది వరకు గ్రామ ప్రజలు అందరూ ఆరుబయట కూర్చొని బలగం చిత్రాన్ని  వీక్షించారు. ఈ సినిమా  ద్వారా పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. 

సినిమా పూర్తిగా తెలంగాణ యాసలో,  పల్లెటూరు వాతావరణంలో  నిర్మించబడిందని,  అందువల్లే గ్రామస్తులందరికీ ఈ చిత్రాన్ని చూపించాలన్న ఉద్దేశంతో తమ గ్రామంలో ప్రదర్శించడం జరిగిందని ఆ గ్రామ సర్పంచ్  రమేష్ యాదవ్ తెలిపారు.