దేశంలో ఉద్యోగాల కోసం సెర్చింగ్ చేయడం తగ్గింది

దేశంలో ఉద్యోగాల కోసం సెర్చింగ్ చేయడం తగ్గింది

న్యూఢిల్లీ:  దేశంలో ఉద్యోగాల కోసం సెర్చింగ్ చేయడం తగ్గిందని  గ్లోబల్ జాబ్ సైట్ ఇండీడ్‌‌‌‌ ఓ రిపోర్ట్‌‌‌‌లో పేర్కొంది.  ఆగస్టు 2021 నుంచి  ఈ ఏడాది ఆగస్టు మధ్య  రిటైల్ జాబ్‌‌‌‌ల కోసం సెర్చింగ్ చేయడం 11.80 శాతం తగ్గిందని తెలిపింది. కరోనా టైమ్‌‌‌‌లోను, ఆ తర్వాత కూడా   రిటైల్ సెక్టార్ (డైరెక్ట్‌‌‌‌గా కన్జూమర్లకు ప్రొడక్ట్‌‌‌‌లను అమ్మే వ్యాపారాల) లో జాబ్స్ 5.5 శాతం  తగ్గిపోయాయని, అందుకే వీటి కోసం చేసే సెర్చ్‌‌‌‌లు తగ్గాయని తెలిపింది. కాగా, ఆగస్టు 2020 నుంచి ఆగస్టు 2021 మధ్య మాత్రం రిటైల్ జాబ్ సెర్చ్‌‌‌‌లు 27.70 శాతం పెరిగాయి. గత ఏడాది కాలంలో రిటైల్ జాబ్‌‌‌‌ సెర్చ్‌‌‌‌లు తగ్గిపోవడానికి కారణం కిందటేడాది లాక్‌‌‌‌డౌన్ ఉండడం,  ఫెస్టివ్ సీజన్‌‌‌‌ టైమ్‌‌‌‌లో ఆన్‌‌‌‌లైన్ షాపింగ్‌‌‌‌లు పెరగడమేనని ఇండీడ్‌‌‌‌ రిపోర్ట్ అభిప్రాయపడింది.  ఆగస్టు 2019–ఆగస్టు 2022 మధ్య ఇండీడ్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లోని జాబ్‌‌‌‌ సెర్చ్‌‌‌‌ల ఆధారంగా ఈ రిపోర్ట్‌‌‌‌ను  ఈ జాబ్ పోర్టల్ తయారు చేసింది.

 రిటైల్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో బ్రాంచ్ మేనేజర్ వంటి  మేనేజర్‌‌‌‌‌‌‌‌ స్థాయిలోని  రోల్స్‌‌‌‌కు ఎక్కువ జాబ్ పోస్టింగ్స్ (22.9 శాతం) వచ్చాయని తెలిపింది. అదే సేల్స్ అసోసియేట్‌‌‌‌ లెవెల్ జాబ్స్‌‌‌‌కు 10.07 శాతం జాబ్ పోస్టింగ్‌‌‌‌లు, స్టోర్ మేనేజర్ రోల్స్‌‌‌‌కు 9.52 శాతం, లాజిస్టిక్స్ సంబంధించిన రోల్స్‌‌‌‌కు 4.58 శాతం, మర్చండైజర్ రోల్స్‌‌‌‌కు 4.38 శాతం జాబ్ పోస్టింగ్‌‌‌‌లు వచ్చాయని ఈ రిపోర్ట్ వివరించింది. జాబ్స్ కోసం వెతికే వారు మాత్రం  స్టోర్ మేనేజర్‌‌‌‌‌‌‌‌ (15 శాతం), రిటైల్ సేల్స్ అసోసియేట్‌‌‌‌ (14.4 శాతం) , క్యాషియర్ (11 శాతం) , బ్రాంచ్ మేనేజర్ (9.49 శాతం), లాజిస్టిక్స్ అసోసియేట్‌‌‌‌ (9.08 శాతం)  రోల్స్‌‌‌‌ కోసం ఎక్కువగా సెర్చ్ చేశారని ఇండీడ్ వెల్లడించింది. ఫెస్టివల్ సీజన్‌‌‌‌లో డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, అందుకే ఎక్కువ టెంపరరీ జాబ్స్‌‌‌‌ క్రియేట్ అవుతాయని  ఇండీడ్‌‌‌‌ ఇండియా  సేల్స్ హెడ్‌‌‌‌ శశి కుమార్ అన్నారు.  కిందటేడాదితో పోలిస్తే ఈసారి తక్కువ సీజనల్ జాబ్స్ క్రియేట్ అయినప్పటికే ఇవి కూడా ఎక్కువేనని  అయ్యాయని పేర్కొన్నారు. ఈ ఫెస్టివ్ సీజన్‌‌‌‌లో 40 శాతం కొత్త ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయని  తెలిపారు.