సీజనల్​ ఫుడ్​​ చాలా సేఫ్​

సీజనల్​ ఫుడ్​​ చాలా సేఫ్​

ఇప్పుడు ఏడాదంతా దాదాపు అన్నిరకాల పండ్లు, కూరగాయలు  దొరుకుతున్నాయి. కానీ, అవన్నీ కోల్డ్ స్టోరేజీ చేసినవే. పైగా ఇవి  సీజన్​లో దొరికే వాటంత టేస్ట్​ ఉండవు. అంతేకాదు ప్రిజర్వేటివ్స్ కలిపిన వీటిని తింటే ఆరోగ్యం దెబ్బతినే ఛాన్స్​ ఉంది. అందుకే ‘ సీజనల్ ఫ్రూట్స్, ఫుడ్​​ ఎక్కువ తినండి’ అని డాక్టర్లు, న్యూట్రిషనిస్టులు తరచూ చెప్తుంటారు. సీజన్​లో దొరికే పండ్లు, కూరగాయలు ఫ్రెష్​గా ఉంటాయి. వీటిలో న్యూట్రిషన్లు నిండుగా ఉంటాయి.  ‘మెనూలో సీజనల్​ ఫుడ్​ ఉంటే ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నట్టే’ అంటోంది డాక్టర్​ రాజ్యలక్ష్మి దేవి. 

సీజన్​లో పండే కూరగాయలు, పండ్లలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు ఎక్కువ. అంతేకాదు  సహజంగా మగ్గిన పండ్లు, ప్రిజర్వేటివ్స్​ కలిపిన వాటికంటే టేస్టీగా ఉంటాయి. సీజన్​లో దొరికే పండ్లు, కూరగాయలు అగ్గువకే దొరుకుతాయి కూడా. కారణం వాటిని ఆయా సీజన్లలో పెద్ద మొత్తంలో పండిస్తారు. దాంతో మార్కెట్లో, తోపుడు బండ్ల మీద... ఇలా ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తాయి. అయితే, సీజన్​ తర్వాత దొరికే పండ్లు, కూరగాయలు చాలా వరకు కోల్డ్ స్టోరేజ్​ చేసినవే. దాంతో వాటిలోని న్యూట్రియెంట్ల శాతం తగ్గిపోతుంది. పైగా వాటికి ధర ఎక్కువ. సీజన్​లో దొరికే ఫుడ్​లో కెమికల్స్​ తక్కువ ఉంటాయి. ఎందుకంటే వీటిని కోల్డ్ స్టోరేజ్ చేయరు.  ప్రిజర్వేటివ్స్ ఉండవు. రోజుల తరబడి ఫ్రిజ్​లో ఉంచాల్సిన అవసరం కూడా ఉండదు.

ఈ పండ్లు తినాల్సిందే

  • ముఖ్యంగా ఈ సీజన్​లో తినాల్సినవి రేగుపండ్లు.
  • రక్తం తక్కువ ఉన్నవాళ్లు రేగుపండ్లు తినడం మంచిది. ఈ పండ్లలో ఐరన్, ఫాస్పరస్ ఎక్కువగా ఉండటం వల్ల ఎర్ర రక్తకణాలు పెరుగుతాయి. ఆల్కలాయిడ్స్ రక్తాన్ని శుభ్రంచేస్తాయి.
  • రేగుపండులో ఆరెంజెస్​లో ఉండే దానికన్నా ఎక్కువ విటమిన్– సి ఉంటుంది. ఇందులోని యాంటీబయాటిక్స్  తరచుగా రోగాల బారిన పడకుండా కాపాడతాయి. విటమిన్ –ఎ స్కిన్ గ్లో అయ్యేలా చేస్తుంది. 
  • ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ బ్రెయిన్ ఫంక్షన్స్ ని మెరుగుపరిచి, నిద్ర మంచిగా పట్టేలా  చేస్తాయి.
  • ఈ పండులో ఎక్కువ ప్రొటీన్స్, ఫైబర్, తక్కువ క్యాలరీలు ఉంటాయి.  డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు ఈ పండుని తినొచ్చు. 
  • దీనిలో ఉన్న క్యాల్షియం ఎముకలను బలంగా చేస్తుంది. ఎదుగుతున్న పిల్లలకు వీటిని తినిపిస్తే శరీరం దృఢంగా తయారవుతుంది.

వింటర్​లో దొరికేవి
క్యారెట్లు, పాలకూర, మెంతికూర, బఠాణీలు, బీట్​రూట్​, ర్యాడిష్​ వంటి కూరగాయలు ఈ సీజన్​లో  ఎక్కువ పండుతాయి. ఆరెంజ్​​, యాపిల్​, దానిమ్మ, గ్రేప్స్, కివి, జామ, స్ట్రాబెర్రీ, రేగు​​ వంటి పండ్లు ఈ సీజన్​లో బాగా దొరుకుతాయి. వీటిని తింటే సరిపోను పోషకాలు అందుతాయి.  సీజనల్​ ఫుడ్​ తినడం వల్ల మరో లాభం ఏమిటంటే... సీజన​ల్​గా వచ్చే హెల్త్​ ప్రాబ్లమ్స్​ నుంచి రక్షణ ఉంటుంది.