బస్సుల్లో మెట్రో తరహాలో సీట్ల అరేంజ్మెంట్

బస్సుల్లో మెట్రో తరహాలో సీట్ల అరేంజ్మెంట్

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ బస్సుల్లో మెట్రో తరహా సీట్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్లలో తిరిగే150 బస్సుల్లో ముందు సీట్లను తొలగించి అడ్డంగా ఉండే సీట్లను అమర్చారు. దశల వారీగా ఇతర బస్సుల్లోనూ ఇదే విధంగా సీట్లను మార్చుతామని అధికారులు తెలిపారు. మహాలక్ష్మి స్కీమ్ వల్ల  బస్సుల్లో రద్దీ అనూహ్యంగా పెరిగిందని చెప్పారు.

సీట్లను అడ్డంగా  ఏర్పాటు చేయటం వల్ల అదనంగా 20 మంది ప్యాసింజర్లు నిలబడే సామర్థ్యం పెరిగిందని వివరించారు.'రాష్ట్రంలో మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం రద్దీ గణనీయంగా పెరిగింది. అందుకే బస్సుల్లో మెట్రో తరహా సీట్లను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నం. దీనికి వచ్చే స్పందన ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటం'అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. కాగా, మహాలక్ష్మి స్కీమ్ తో ఇప్పటి వరకు సుమారు 18 కోట్ల మంది మహిళలు ఫ్రీ జర్నీచేశారు.