
హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం(సెప్టెంబర్29) షెడ్యూల్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో 565 మండలాల్లో 5,749 ఎంపీటీసీ, 656 జడ్పీటీసీ స్థానాలకు, 12,733 గ్రామపంచాయతీలు, 1లక్షా12వేల288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్‌ఈసీ తెలిపింది.అయితే రాష్ట్రమంతటా ఎన్నికల సందడి మొదలవగా కొన్ని గ్రామపంచాయతీలు, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించబోవడం లేదని ఎస్ఈసీ ప్రకటించింది.
కరీంనగర్, ములుగు జిల్లాల్లో 14 ఎంపీటీసీ, 27 గ్రామ పంచాయతీలకు 246 గ్రామ వార్డులు ఎన్నికలకు దూరంగా ఉండనున్నాయని స్పష్టం చేశారు. కోర్టు కేసుల కారణంగా ఇక్కడ ఎన్నికల నిర్వహణ సాధ్యం కావడం లేదని, హైకోర్టు ఆదేశాల మేరకు ఈ స్థానాల్లో ఎన్నికలు జరగబోవని తెలిపారు. ములుగు జిల్లాలోని 25 గ్రామ పంచాయతీలు, కరీంనగర్ జిల్లాలోని 2 పంచాయతీలకు ఎన్నికలు లేవని స్పష్టం చేశారు.
►ALSO READ | ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ ఇదే..