ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

విజయవాడ: భారీ వర్షాలతో కృష్ణా నదిలో వరద పోటెత్తుతోంది. ఎగువ నుండి వస్తున్న వరదకు తోడు.. కురుస్తున్న భారీ వర్షాల వల్ల గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతోంది. విజయవాడ నగరానికి వరద ముప్పు తప్పినట్లు కనిపిస్తున్నా.. పరిస్థితిని కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నామంటున్నారు అధికారులు. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వస్తున్న వరదను వస్తున్నట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం గేట్లన్నీ ఎత్తి  6 లక్షల 50 వేల క్యూసెక్కుల వరద దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు హెచ్చరికలు జారీ చేశారు. నదీ తీర ప్రాంతాల వారిని నిరంతరం అప్రమత్తం చేస్తూ.. ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

శ్రీశైలం డ్యాం వద్ద..

ఇన్ ఫ్లో: 3 లక్షల 51 వేల 761 క్యూసెక్కులుగా ఉంది.

అవుట్ ఫ్లో: 3 లక్షల 53 వేల 518 క్యూసెక్కులు

నాగార్జునసాగర్ వద్ద…

ఇన్ ఫ్లో: 2 లక్షల 99 వేల 667 క్యూసెక్కులు

అవుట్ ఫ్లో: 2 లక్షల 99 వేల 667 క్యూసెక్కులు

పులిచింతల వద్ద…

ఇన్ ఫ్లో: 4 లక్షల 95 వేల 431 క్యూసెక్కులు

అవుట్ ఫ్లో: 5 లక్షల 42 వేల 909 క్యూసెక్కులు

ప్రకాశం బ్యారేజీ వద్ద…

ఇన్ ఫ్లో: 6 లక్షల 49 వేల 987 క్యూసెక్కులు

అవుట్ ఫ్లో: 6 లక్షల 49 వేల 987 క్యూసెక్కులు