పల్లె ప్రగతి షెడ్యూల్.. ఏ రోజు ఏం చేస్తరు?

పల్లె ప్రగతి షెడ్యూల్.. ఏ రోజు ఏం చేస్తరు?

హైదరాబాద్, వెలుగుసర్కార్‌‌‌‌‌‌‌‌ చేపడుతున్న రెండో దశ పల్లె ప్రగతి గురువారం మొదలైతున్నది. గురువారం నుంచి 11వ తేదీ వరకు ఇది కొనసాగనుంది. గతేడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో చేపట్టిన యాక్షన్ ప్లాన్‌‌‌‌‌‌‌‌లో చేపట్టిన పనులను కొనసాగించి పూర్తి చేయాలని పీఆర్ కమిషనర్ రఘనందన్ రావు ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చిన్రు. కలెక్టర్లు, ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శులు, స్పెషల్ ఆఫీసర్లకు ఈ ఆర్డర్లు అందాయి. పల్లె ప్రగతిలో టార్గెట్లను వాటిలో వివరించారు. అంతకు ముందే డిసెంబర్ 31న, జనవరి 1న సర్పంచ్‌‌‌‌‌‌‌‌లు, వార్డు, కో ఆప్షన్ సభ్యులు ఊర్లలలో కాలినడకన తిరిగి సమస్యలు గుర్తించిన్రు. వీటిని పల్లె ప్రగతిలో పరిష్కరించాలని ప్లాన్లు చేస్తున్నరు. చేపట్టిన పనులపై రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ రెడీ చేయాలని ఆర్డర్లలో పేర్కొన్నరు. ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌ అయిపోయినంక ఏ రోజు ఏ పనులు చేపట్టారో రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ రెడీ చేసి ఎంపీడీవోలకు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లు ఆదేశించారు.

జనవరి 1

  •      గ్రామాన్ని శుభ్రంగా ఉంచే పనులు చేపట్టాలి
  •     పచ్చదనం పెంచేలా కార్యక్రమం చేపట్టడం
  •     డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు నిర్వహించుట
  •     ఒక రోజు పూర్తిగా శ్రమదానం చేపట్టాలి
  •     విరాళాలు ఇచ్చే దాతలను ఎంకరేజ్‌‌‌‌‌‌‌‌ చేయాలి.

జనవరి 2

  •     అధికారుతో గ్రామసభ నిర్వహించాలి.
  •     30 రోజుల ప్లాన్‌‌‌‌‌‌‌‌లో చేసిన పనులు, ఖర్చయిన నిధులు వెల్లడించాలి.
  •     ఏప్రిల్ 2019 నుంచి డిసెంబర్ 2019 వరకు ప్రభుత్వం నుంచి వచ్చి ఫండ్స్‌‌‌‌‌‌‌‌, వసూలైన పన్నులు, ఆదాయ వ్యయాలు తెలపాలి.
  •     పంచాయతీల్లో దాతలను గుర్తించాలి.

జనవరి 3, 4వ తేదీలు

  •     పాడుబడిన ఇండ్లు, కొట్టాలు, సర్కార్ తుమ్మలు, జిల్లేడు చెట్లు తొలగించాలి.
  •     పాత బావులు, వాడని బోర్లు, నీటిగుంతలను పూడ్చి వేయాలి.
  •     ఖాళీ స్థలాల్లో చెత్త చెదారం ఉంటే తొలగించాలని ఓనర్లకు నోటీసు ఇవ్వాలి, లేకుంటే ఫైన్ వేయాలి.

జనవరి 5, 6 తేదీలు

  •     ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత నిర్మించాలి
  •     డ్రైనేజ్‌‌‌‌‌‌‌‌లు శుభ్రం చేసి, మురికి కాల్వల్లో చెత్త తొలగించి.. దోమల మందు స్ప్రే చేయాలి
  •     రోడ్లపై గుంతలు పూడ్చాలి
  •     ప్లాస్టిక్ సీసాలు, పేపర్లను సేకరించి విడదీయాలి

జనవరి 7

  •     శ్రమదానంతో బడులు, దవాఖానాలు, ప్రభుత్వ ఆఫీసులు, సంతలు, మార్కెట్లలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలి

జనవరి 8

  •     డంపింగ్ యార్డు జాగా చూసి, నిర్మించాలి.
  •     వైకుంఠధామాలకు జాగా గుర్తించి నిర్మించాలి.

జనవరి 9

  •     నర్సరీ ఏర్పాటు చేయాలి, చుట్టూ ఫెన్సింగ్, బోర్డు ఉండాలి.
  •     గ్రామంలో, ఊరు బయట ఖాళీ జాగాల్లో మొక్కలు నాటాలి
  •     పంచాయతీ బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో 10 శాతం పచ్చదనం పెంచేందుకు ఖర్చువెట్టాలి
  •     నాటిన మొక్కల్లో 85 శాతం బతికేలా చూడాలి

జనవరి 10

  •     పవర్ వీక్‌‌‌‌‌‌‌‌లో మిగిలిన పనులు పూర్తి చేయాలి
  •     వదులుగా ఉన్న కరెంట్ వైర్లు సరిచేయాలి
  •     వంగిన, తుప్పు పట్టిన స్తంభాలు మార్చాలి.
  •     ఎల్‌‌‌‌‌‌‌‌ఈడీ బల్బులు అమర్చాలి, వీధి లైట్ల కోసం సపరేట్ మీటర్ , స్విచ్చ్‌‌‌‌‌‌‌‌లు బిగించాలి
  •     పగలు వీధి లైట్లు వెలగకుండా చర్యలు చేపట్టాలి

జనవరి 11

  • చివరి రోజు ముగింపు గ్రామ సభ నిర్వహించాలి
  • విరాళాలు ఇచ్చిన దాతలను సన్మానించాలి
  • పది రోజుల్లో చేసిన పనులపై సమీక్షించి, ఇకపై ప్రతి రోజు ఈ పనులు జరిగేలా చూడాలి.