
ముషీరాబాద్, వెలుగు: ఇంటర్మీడియట్కార్పొరేట్ కాలేజీలు రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని బీసీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ చెప్పారు. వేసవి సెలవుల్లో ఎంసెట్ కోచింగ్పేరుతో సెకండ్ ఇయర్ క్లాసులు నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. గురువారం ఆయన విద్యానగర్ లోని తన ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. స్టూడెంట్లకు వేసవి సెలవులు ఇవ్వకుండా క్లాసులు నిర్వహిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ రాకముందే జరుపుతున్న అడ్మిషన్లను రద్దు చేయాలని కోరారు. ఈ ఏడాది నుంచి ఇంటర్అడ్మిషన్లను ఆన్లైన్ ద్వారా చేపట్టాలని, తెలంగాణలో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలుచేసి, కార్పొరేట్కాలేజీల ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఒక కాలేజీకి పర్మిషన్ తీసుకుని, అనేక బ్రాంచులు రన్చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.