- స్పెషల్ పార్కింగ్ ఏర్పాటు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ నెల15 వరకు జరగనున్న అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్- సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ట్రాఫిక్‌రద్దీని బట్టి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సీటీవో క్రాస్ రోడ్స్, ప్లాజా క్రాస్‌రోడ్స్, టివోలి క్రాస్ రోడ్స్మూసివేసే అవకాశం ఉంటుందని, అవసరాన్ని బట్టి డైవర్షన్స్అమలు చేస్తామన్నారు.
కైట్ఫెస్టివల్వల్ల పై ఏరియాలతో పాటు పికెట్జంక్షన్, సికింద్రాబాద్క్లబ్(ఇన్‌గేట్), ఎన్సీసీ, స్వీకార్ఉపకార్, వైఎంసీఏ, ఎస్బీఐ జంక్షన్, బాలంరాయి, బ్రూక్‌బాండ్, తాడ్బండ్క్రాస్రోడ్స్, మస్తాన్కేఫ్వద్ద రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. అందుకని సికింద్రాబాద్, జూబ్లీ బస్టాండ్‌వైపు వెళ్లే ప్రయాణికులు రద్దీ లేని సమయాల్లో ప్రయాణాలు ప్లాన్చేసుకోవాలన్నారు.
పార్కింగ్ పాయింట్లు ఇవి..
కైట్ఫెస్టివల్కు వచ్చేవారి కోసం పలుచోట్ల పోలీసులు పార్కింగ్పాయింట్లు ఏర్పాటు చేశారు. ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్‌నుంచి వచ్చేఈవెంట్ఆర్గనైజర్లు పరేడ్గ్రౌండ్ఈస్ట్ గేట్‌కు రెండు వైపులా పార్క్చేసుకోవాలి. పంజాగుట్ట, ట్యాంక్‌బండ్ నుంచి వచ్చే సాధారణ ప్రజల కోసం జింఖాన గ్రౌండ్స్‌లో పార్కింగ్ఏర్పాటు చేశారు. కూకట్పల్లి, మేడ్చల్, బోయినపల్లి నుంచి వచ్చే వారు దోభీఘాట్‌లో పార్క్చేసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు దోభీఘాట్పార్కింగ్పాయింట్ నుంచి పరేడ్‌గ్రౌండ్‌కు షటిల్బస్సర్వీస్ఉంటుందని పోలీసులు తెలిపారు.
