పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ లో భారీగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పట్టుబడింది. సిక్కు విలేజ్లోని ఇంపీరియల్ గార్డెన్లో మంగళవారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ నిర్వహిస్తున్నారు. అతిథుల కోసం తెలంగాణ మద్యం కాకుండా తక్కువ ధరకు లభించే ఎన్‌డీపీఎల్ మద్యం కొనుగోలు చేసి వినియోగిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖకు సమాచారం అందింది. దీంతో దాడులు చేసి, మొత్తం 262 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
వాటిలో 44 బాటిళ్లు ఎయిర్పోర్ట్ డ్యూటీ ఫ్రీ షాపుల నుంచి, 23 బాటిళ్లు గోవా నుంచి, 191 బాటిళ్లు డిఫెన్స్ విభాగానికి సంబంధించినవిగా గుర్తించారు. వీటి విలువ రూ.8.15 లక్షలకు వరకు ఉంటుదని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు.
