
- సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్, వెలుగు : ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దని.. ఆ బాధ్యత పాలకమండలిపై ఉందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. మంగళవారం సికింద్రాబాద్లోని గణేశ్ టెంపుల్ 2024 సంవత్సర క్యాలెండర్ను వెస్ట్ మారేడ్ పల్లిలోని తన ఇంటి వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని పేర్కొన్నారు.
గణేష్ టెంపుల్ను కూడా అభివృద్ధి చేసి భక్తులకు అవసరమైన సౌకర్యాలను కల్పించిందని వివరించారు. ఆలయ అభివృద్ధికి కమిటీ సమష్టిగా కృషి చేయాలని, తనవంతు సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఆలయ చైర్మన్ ఓదెల సత్యనారాయణ, సభ్యులు వజీర్ మోహన్, వినోద్, అశోక్, శ్రీశైలం తదితరులు ఉన్నారు.