పరీక్ష రాసేందుకు వెళ్తుండగా ప్రమాదం.. విద్యార్థికి గాయాలు.. ఆ తర్వాత ఏమైందంటే..

పరీక్ష రాసేందుకు వెళ్తుండగా ప్రమాదం.. విద్యార్థికి గాయాలు.. ఆ తర్వాత ఏమైందంటే..

ఇంటర్  పరీక్ష రాసేందుకు ఈరోజు(మార్చి 1) ఓ విద్యార్థి  పరీక్ష కేంద్రానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో విద్యార్థినికి గాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న మహంకాళి ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ఆమెకు ప్రథమ చికిత్స చేసి.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించి.. విధి నిర్వహణలో మానవత్వం చాటుకున్నారు ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్. వివరాల్లోకి వెళితే.. 

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాసేందుకు.. ఓ విద్యార్థిని తన తండ్రితోపాటు ద్వి చక్ర వాహనంపై పరీక్ష కేంద్రానికి వెళ్తుండగా.. సికింద్రాబాద్ ఎంజీ రహదారి తపస్య కళాశాల దగ్గర ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్దరు కింద పడిపోయారు. దీంతో ఆ విద్యార్థిని తలకు గాయాలయ్యాయి. అక్కడే విధులు నిర్వహిస్తోన్న మహంకాళి ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ఉపాశంకర్.. ఇది గమనించి వెంటనే తన వాహనంలో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి.. చికిత్స చేయించారు.

ఆసుపత్రికి తీసుకెళ్లే ముందు పరీక్షా కేంద్రంలోని ప్రిన్సిపల్ అనుమతి తీసుకుని.. ఆమెను ప్రాథమిక చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని తలకు ఏడు కుట్లు పడినట్లు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత విద్యార్తిని పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చి వదిలిపెట్టగా.. ఆమె ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపింది.