ఉప్పరి బస్తీకి అమ్మవారి ఘటం.. సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళి బోనాలు

ఉప్పరి బస్తీకి అమ్మవారి ఘటం..  సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళి బోనాలు

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో సోమవారం (జులై 07) ఉదయం అమ్మవారి ఘటం ప్రధాన ఆలయం నుంచి ఊరేగింపుగా బయల్దేరి ఉప్పరిబస్తీకి చేరుకుంది. ఆక్కడ స్థానిక మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం, పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. 

అనంతరం తిరిగి అమ్మవారి ఘటము ప్రధాన ఆలయానికి రాత్రి చేరుకుంది. మరోవైపు ఈ నెల 13న బోనాల జాతరకు సంబంధించి సోమవారం నార్త్​ జోన్​ డీసీపీ రష్మీ పెరుమాళ్​ ఏర్పాట్లను పర్యవేక్షించారు.