అక్టోబర్ 31 న శ్రీగిరి ఆలయ ప్రారంభోత్సవం

అక్టోబర్ 31 న  శ్రీగిరి ఆలయ ప్రారంభోత్సవం

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్​శ్రీనివాసనగర్‌ శ్రీగిరి ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయం శుక్రవారం పున:ప్రారంభం కానుంది. గురువారం కంచికామకోటి పీఠాధిపతి శంకరాచార్య శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారు ఆలయానికి విచ్చేసి ప్రవచనాలిచ్చారు. దాదాపు ₹16 కోట్లతో మూడేండ్ల పాటు చేసిన రెనోవేషన్ పనులు ముగియడంతో శుక్రవారం పునర్​ప్రారంభించనున్నారు. కంచి కామకోటి శంకరాచార్య శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి, పుష్పగిరి, శ్రీమద్ అష్టాక్షరి పీఠాధిపతులు అష్ట బంధన మహా కుంభాభిషేకం నిర్వహించి, ఆలయాన్ని ప్రారంభిస్తారు.