సికింద్రాబాద్ - అర్సికెరె ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్ - అర్సికెరె ప్రత్యేక రైళ్లు
  • నేటి నుంచే అందుబాటులోకి.. 
  • కాచిగూడ - తిరుపతి మధ్య ఏసీ ట్రైన్​లు

హైదరాబాద్​సిటీ, వెలుగు: సికింద్రాబాద్ – హైదరాబాద్​ నుంచి కర్నాటకలోకి అర్సికెరెకు, కాచిగూడ నుంచి తిరుపతికి స్పెషల్​రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్​ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్​ నుంచి ఆర్సికెరె (07079 )కు ప్రతి ఆదివారం ఉదయం 6.05 గంటలకు ఉంటుందని, ఈనెల 13 నుంచి ఆగస్టు 31 వరకు నడుపనున్నట్లు పేర్కొన్నారు.  అర్సికెరె – సికింద్రాబాద్(07080) మధ్య ప్రతి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఉంటుందని, ఈరైలు14 నుంచి సెప్టెంబరు 1 వరకు నడుస్తుందని చెప్పారు. 

ఈ రైళ్లు బేగంపేట, వికారాబాద్, ఎలహంక రూట్​లో వెళ్తాయన్నారు.  అలాగే, హైదరాబాద్​– అర్సికెరె(070769) మధ్య ప్రతి మంగళవారం ఉదయం 7.20 గంటలకు మరో ట్రైన్ ​ఉంటుందన్నారు. ఈ రైలు ఈనెల 8 నుంచి ఆగస్టు 26 వరకు నడుస్తుందన్నారు. అర్సికెరె – హైదరాబాద్(07070 ) ప్రతి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఉంటుందని, ఈ నెల 9 నుంచి ఆగస్టు 27 వరకు నడుస్తుందన్నారు. 

ఈ రైలు సికింద్రాబాద్​ నుంచి కాచిగూడ, కర్నూల్​సిటీ, తూంకూరు మీదుగా వెళ్తుందన్నారు. కాచిగూడ – తిరుపతి(​07676) మధ్య ప్రతి మంగళవారం 11.30 గంటలకు ఒక రైలు ఉంటుందని, ఈ నెల 8న అందుబాటులో ఉంటుందని తెలిపారు. జడ్చర్ల , కడప , రేణిగుంట నుంచి  వెళ్తాయని, ఇవన్నీ  ఏసీ కోచ్​లే అని వివరించారు.