శిర్డీ ఆలయానికి భద్రత పెంపు

శిర్డీ ఆలయానికి భద్రత పెంపు

దేశంలోని ప్రముఖ  శిర్డీ సాయిబాబా దేవాలయానికి బాంబు బెదిరింపుల నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్​ భద్రత చర్యలు చేపట్టింది. శిర్డీ సాయిబాబా సంస్థాన్‌కు కేంద్ర భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త సంజయ్ కాలే హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల తర్వాత కేంద్రం సీఆర్పీఎఫ్ భద్రత కల్పించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే శిర్డీ గ్రామస్తులు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. 

జులై 1 నుంచి ఆలయానికి మహారాష్ట్ర సెక్యూరిటీ ఫోర్స్​అదనపు భద్రత కల్పించింది. ఇందుకోసం అస్నార్​లో 75  మంది జవాన్లు మోహరించారు. వీరు ఆలయ గభారా, ప్రవేశ ద్వారాలకు రక్షణ కల్పించనున్నారు. వీరికి తోడు 100 మంది రాష్ట్ర పోలీసులు అదనపు భద్రత కల్పించనున్నారు.