Mirra Andreeva: ఫ్రెంచ్ ఓపెన్ (French Open) టెన్సిస్ టోర్నీలో ఒక చారిత్రాత్మక రికార్డు నమోదు అయింది. జస్ట్ 19 ఏళ్ల రష్యాన్ స్టార్ మిర్రా ఆండ్రీవా (Mirra Andreeva) తన కెరీర్ లో ఫస్ట్ గ్రాండ్ స్లామ్ టైటిల్ ని సాధించి హిస్టరీ క్రియేట్ చేసింది. పోలాండ్ క్వాలిఫయర్ మాయా చ్వాలిన్స్కాను వరుస సెట్లలో ఓడించి.. గత కొన్ని దశాబ్దాల్లోనే ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన అతి చిన్న వయస్కురాలైన మహిళా ఛాంపియన్ గా అవతరించింది. కానీ విజయం తర్వాత టెన్నిస్ కోర్టులో జరిగిన ఓ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
రష్యన్ జాతీయ జెండా తొలగింపు:
కోర్ట్ ఫిలిప్ చాట్రియర్ లో మ్యాచో ఆయిపోయిన తర్వాత ట్రోఫీ ప్రెజెంటేషన్ జరిగే సమయంలో గ్యాలరీలో ఉన్న కొందరు అభిమానులు రష్యన్ జెండాను (Russian Flag) ప్రదర్శించేందుకు ట్రై చేశారు. కానీ ఇది చూసిన వెంటనే టోర్నమెంట్ సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఒక సెక్యూరిటీ గార్డ్ ఆ ఫ్యాన్స్ దగ్గరికి వెళ్లి.. ఆ జెండాను వెంటనే లోపల పెట్టేలాని ఆర్డర్ వేశాడు. కాగా ఫ్రెంచ్ ఓపెన్ నిబంధనల ప్రకారం స్టేడియం లోపల రష్యా జాతీయ చిహ్నాలను ప్రదర్శించడంపై నిషేధం విధించారు.
ఈ రూల్ ఎందుకు పెట్టారంటే?:
రష్యా– ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ టెన్నిస్ సంస్థలు రష్యా, బెలారస్ దేశాలపై కఠిన ఆంక్షలు విధించాయి. ఈ రూల్స్ ప్రకారం.. రష్యా, బెలారస్ ప్లేయర్స్ మేజర్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో తమ దేశం తరపున కాకుండా కేవలం న్యూట్రల్ అథ్లెట్లుగా (Neutral Status) మాత్రమే ఆడాల్సి ఉంటుంది. అందుకే మిర్రా ఆండ్రీవా రష్యాలోనే జన్మించినప్పటికీ, ఆమె కోర్టులో రష్యన్ ప్లాగ్ కింద పోటీ చేయలేకపోయింది.
ఆండ్రీవా క్లీస్ పర్ఫామెన్స్:
టెన్నిస్ టోర్నమెంట్లో రష్యన్ జాతీయ జెండా గొడవ వల్ల కాసేపు గందరగోళం కొనసాగినప్పటికీ, మళ్లీ అందరి ఫోకస్ మొత్తం మిర్రా ఆండ్రీవా సాధించిన అద్భుతమైన విజయం పైకే వెళ్లిపోయింది. ఈ 19 ఏళ్ల అమ్మాయి టోర్నమెంట్ స్టార్టింగ్ నుంచి ఎంతో మెచ్యూర్టుగా ఆడుతూ.. ఫైనల్లో కూడా క్లాస్ పర్ఫామెన్స్ తో అందరి మైండ్ బ్లాక్ చేసేసింది.
As Andreeva celebrated her win, a pair of fans inside Chatrier whipped out and waved a Russian flag to celebrate Andreeva’s country.
— Ben Rothenberg (@BenRothenberg) June 6, 2026
A #RolandGarros security guard quickly swooped in and had them put it away in the guy’s purse. pic.twitter.com/UfzI0h3m1Y
