ఇంటి వంటకే ప్రాధాన్యం ఇవ్వండి : మంత్రి సీతక్క

ఇంటి వంటకే ప్రాధాన్యం ఇవ్వండి : మంత్రి సీతక్క

ములుగు, వెలుగు : అమ్మ మాట అంగన్​వాడీ బాటతోనే ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించడం జరుగుతుందని, జంక్ ఫుడ్‌‌‌‌కు స్వస్తి చెప్పి ఇంటి వంటకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడడమే లక్ష్యంగా పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. శనివారం ములుగు జిల్లా కేంద్రంలోని ఐ లవ్ ములుగు థీమ్ వద్ద పోషణ్ పక్వాడ కార్యక్రమం అవగాహన ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. 

అనంతరం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్, పాత బస్టాండ్ సమీపంలో చలివేంద్రాలను ప్రారంభించారు. పద్మశాలి భవన్ లో ఏర్పాటుచేసిన పోషణ్ పక్వాడ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఐసీడీఎస్ విభాగం ఆధ్వర్యంలో ఏప్రిల్ 9 – 23వరకు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్​పర్సన్ రేగ కల్యాణి, మున్సిపాలిటీ చైర్ పర్సన్ చింత నిప్పుల చంద్రకళ, వైస్ చైర్పర్సన్ ఆసియా షాహీన్, డీడబ్ల్యూవో ప్రేమలత, సీడీపీవో శిరీష తదితరులు పాల్గొన్నారు.