మాది ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం : మంత్రి సీత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్క

మాది ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం :  మంత్రి సీత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్క
  •     జీపీ సెక్రటరీస్ అసోసియేషన్  డైరీ ఆవిష్కరణలో మంత్రి సీత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్క 

హైదరాబాద్​, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో తాము సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తున్నామని పీఆర్, ఆర్డీ మినిస్టర్ సీతక్క అన్నారు. జీవో నంబర్–317తో స్థానికత కోల్పోయి దూర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న 223 మంది పంచాయతీ కార్యదర్శులకు రెండేండ్లపాటు అంతర్ జిల్లా డిప్యూటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఈ మేరకు బుధవారం సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ (టీపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ) క్యాలెండర్, డైరీని మంత్రి సీతక్క ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులను మంత్రి సీతక్క అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూలమైనదని చెప్పారు. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించి అంతర్ జిల్లా డిప్యూటేషన్లకు అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు.