నవీన్‌‌ను గెలిపిస్తే మీ ముంగిట్లోకే సంక్షేమం : మంత్రి సీతక్క

నవీన్‌‌ను గెలిపిస్తే మీ ముంగిట్లోకే సంక్షేమం : మంత్రి సీతక్క
  •     జూబ్లీహిల్స్‌‌లో బీఆర్‌‌ఎస్‌‌ను మూడుసార్లు గెలిపిస్తే అభివృద్ధి జరగలే: సీతక్క 

జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్‌‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌‌ను గెలిపిస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ పేదల ఇండ్లకే వెతుక్కుంటూ వస్తాయని మంత్రి సీతక్క అన్నారు. బీఆర్ఎస్‌‌కు ఇక్కడ మూడుసార్లు అవ‌‌కాశం ఇచ్చినా అభివృద్ధి జరగలేదని ఆరోపించారు బుధవారం బోరబండ ఎన్ఆర్ఆర్ పురం సైట్-1 కాలనీలో స్థానిక కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఆమె పాల్గొని మాట్లాడారు. 

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అనేక మురికివాడలు ఉన్నాయని, వాటన్నింటిని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌‌కు జూబ్లీహిల్స్‌‌పై పట్టుందని, ఆయనను గెలిపించుకుంటే మన ప్రాంతంలో ఉండే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని తెలిపారు.

 కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పక్షాన నిలబడే పార్టీ అని, నేడు అలాంటి పార్టీని జూబ్లీహిల్స్‌‌లో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు బండ్రు శోభారాణి, మువ్వ విజయ్ బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు హబీబా సుల్తానా, డివిజన్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు