తల్లి చనిపోయారని తెలిసినా షూటింగ్ పూర్తి చేసిన చంద్రమోహన్

తల్లి చనిపోయారని తెలిసినా షూటింగ్ పూర్తి చేసిన చంద్రమోహన్

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో గొప్ప పాత్రలు చేసిన ప్రేక్షకుల మనసులు గెలుచున్న అలనాటి హీరో చంద్రమోహన్(Chandramohan) కన్నుమూశారు. అనారోగ్యంతో కొంతకాలంగా అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయన.. శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. ఆయనతో తమకున్న సాన్నిహిత్యాన్ని నెమరువేసుకుంటున్నారు.  

చంద్రమోహన్ సినిమాల పట్ల, ఆయన చేసే పనిపట్ల చాలా డేడికేటెడ్ గా ఉండేవారట. దానికి ఈ ఒక సంఘటన ఉదాహారణగా చెప్పొచ్చు. ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన మనసంతా నువ్వే సినిమాలో చంద్రమోహన్ ఆయనకే  తండ్రి పాత్రలో కనిపించారు. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో చంద్రమోహన్ తల్లి మరణించింది. ఆ విషయం తెలిసినా.. షూటింగ్ మధ్యలో ఆపేయడం ఇష్టంలేక, షూటింగ్ కంప్లీట్ చేసి తల్లిని చూడటానికి వెళ్లారట చంద్రమోహన్. ఈ విషయాన్నీ స్వయంగా చంద్రమోహన్ ఓ ఇంటర్వ్యూలో తెలియచేశారు.