సూర్యాపేట జిల్లాలో పంచాయతీ కార్యదర్శిపై సీనియర్ అసిస్టెంట్ దాడి

సూర్యాపేట జిల్లాలో పంచాయతీ కార్యదర్శిపై సీనియర్  అసిస్టెంట్  దాడి

గరిడేపల్లి, వెలుగు: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి ఎంపీడీవో ఆఫీస్​ ఆవరణలో మండలంలోని లచ్యా తండా గ్రామపంచాయతీ కార్యదర్శి సుధాకర్ పై సీనియర్  అసిస్టెంట్  మొయినుద్దీన్  దాడి చేయడం కలకలం రేపింది. శనివారం సీనియర్​ అసిస్టెంట్​ బైక్​ను అడ్డుకొని తన సర్వీస్  బుక్​ ఎంట్రీలను మూడేళ్లుగా ఎందుకు నమోదు చేయలేదని, భవిష్యత్​లో తనకు సమస్య వస్తుందని వాపోయాడు. 

సీనియర్​ అసిస్టెంట్​ బదిలీ కావడంతో తనకు ఇబ్బంది కలుగుతుందని, వెంటనే సర్వీస్​ బుక్​లో ఎంట్రీ చేయాలని వేడుకున్నాడు. ఈక్రమంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో సీనియర్​ అసిస్టెంట్​ కోపంతో తన లంచ్​ బాక్స్​తో దాడి చేశాడు. 

ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ మూడేళ్లుగా సర్వీస్​ బుక్​లో ఎంట్రీలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నాడని వాపోయాడు. సర్వీస్  బుక్  ఎంట్రీల కోసం రూ.3 వేలు డిమాండ్  చేశాడని, వేరే వాళ్లు డబ్బులు ఇచ్చారని తనపై ఒత్తిడి తెచ్చాడని ఆరోపించాడు. ఈ ఘటనతో ఎంపీడీవో ఆఫీస్​ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.